మహా శైవక్షేత్రం చిక్కమగళూరు

💐💐పార్వతి దేవి సృష్టించిన అమృత తీర్ధం — మహా శైవక్షేత్రం చిక్కమగళూరు💐💐

పార్వతి దేవి సృష్టించిన అమృత తీర్ధం – అనేక అసాధ్య రోగాలకు సంజీవిని వంటిది

ఆకట్టుకునే మహా శైవక్షేత్రం చిక్కమగళూరు, ప్రకృతి అందాలు..సెలయేళ్ల గలగలలే కాకుండా ప్రకృతి ఒడిలోని ఆలయాలెన్నో భక్తుల్ని విశేషంగా ఆకర్షిస్తున్నాయి. అక్కడి నీటిని సేవిస్తేచాలు.. అనేక రుగ్మతలు మాయమవుతాయని భక్తులు విశ్వసిస్తారు. ఏడాది పొడవునా అక్కడ నీటి ధార పెల్లుబుకుతోంటుంది. అదే తుంగా ఉపనది బ్రహ్మ. అక్కడి తీర్థాన్ని స్వీకరించి అనారోగ్య సమస్యల్ని దూరం చేసుకునేందుకు నిత్యం వందలాది మంది ఆలయాన్ని సందర్శిస్తుంటారు. ఇంతకూ అది ఏమిటో? ఎక్కడుందో తెలుసా? చిక్కమగళూరు జిల్లాలోని కొప్ప పట్టణానికి పది కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే అడవుల నడుమ కమండల గణపతి ఆలయం దర్శనమిస్తుంది. ఇక్కడి ఆలయం వెయ్యేళ్లనాటిదని చెబుతారు. శని వక్రదృష్టి కారణంగా తీవ్ర సమస్యల్ని ఎదుర్కొన్న పార్వతీ దేవి ఇక్కడికి వచ్చి వినాయాకుడిని ప్రార్థిస్తుందట. ఆలయానికి సమీపంలో ఆమె తపస్సు చేసినట్లుగా చెప్పే ప్రదేశం ఉంది. భక్తులకు మేలుచేసేందుకు తీర్థాన్ని సృష్టించిందని స్థల పురాణం చెబుతుంది.

కొండల్లో నుంచి భూగర్భంలో చేరుకుని కుండికలో ప్రత్యక్షమయ్యే నీటిలో అనేక ఔషధ గుణాలున్నాయంటారు. ఇక్కడి నుంచే బ్రహ్మ నది జన్మించి సుదూరంగా ప్రయాణించి తుంగానదిలో కలుస్తుంది. పుణ్యక్షేత్రాలైన కళస, హొరనాడు ప్రాంతాల్ని సందర్శించేందుకు వచ్చే భక్తులు కమండల గణపతి ఆలయాన్ని కూడా దర్శించుకుని వెళ్తుంటారు.

ఓం శ్రీ మాత్రే నమః
ఓం గం గణపతయే నమః

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *