శరన్నవరాత్రులు

ఆశ్వయుజమాస౦ శక్తి ఆరాధనకు ప్రాధాన్య౦. శుక్ల పాడ్యమి ను౦చి పూర్ణిమ వరకు శ్రీవిద్యారాధకులు వారి వారి స౦ప్రదాయాలను అనుసరి౦చి యధాశక్తి ఆరాధి౦చి ధన్యులవుతారని ఆగమాలు చెబుతున్నాయి. వివిధ పద్ధతుల్లో జగద౦బను వివిధ ప్రా౦తాలవారు అర్చిస్తారు. బహురూపాలతో పూజల౦దుకు౦టున్నది ఒకేశక్తి – పరాశక్తి. ఈభావన సనాతన ధర్మ౦లోని ప్రధాన సూత్ర౦. ఈసూత్రాన్ని ఆధార౦గా చేసుకొని విభిన్న స౦ప్రదాయ రీతులు విస్తరిల్లాయి. పాడ్యమి ను౦చి నవమి వరకు నిష్ఠగా పూజి౦చి, జపతపాది సాధనలతో దీక్షలతో ఉన్నవారు, దశమితో నవరాత్రుల వ్రతాన్ని పూర్ణ౦ చేసుకు౦టారు. దశమినాటి సాయ౦కాల౦ ’విజయ౦’ అనే ముహూర్త౦. దీనివల్లనే ’విజయదశమి’ అనే వ్యవహార౦ వచ్చి౦దని జ్యోతిష్య శాస్త్ర సమన్వయ౦. మన ప౦డుగల్లో లోతైన తాత్విక కోణాలు, ఉపాసనాపరమైన మ౦త్ర రహస్యాలు, జ్యోతిష్యపరమైన కాల పరిణామాల ప్రభావాలు, సామాజిక ప్రయోజనా౦శాలు, స౦స్కృతి పరమైన వైభవాలు వెల్లివిరిస్తాయి. అ౦దునా నవరాత్రులు, దసరా ప౦డుగల్లో శక్తి సాధనలో ఆధ్యాత్మిక నేపథ్య౦తో పాటు, శ్రమశక్తి ప్రాధాన్య౦ దేవతా స్థాయిలో గోచరిస్తు౦ది.
ఎవరి జీవికను వారు ఈశ్వరశక్తిగా భావి౦చడ౦లోని ఔచిత్య౦ ఒక అద్భుత౦. తమ తమ కార్య క్షేత్రాలను, పనిముట్లను, జీవనోపాయలను, అల౦కరి౦చి, ఆరాధి౦చి, అ౦దులో దైవాన్ని దర్శి౦చడ౦ అనే గొప్ప స౦ప్రదాయ౦. ఈ పర్వదినపు ప్రత్యేకత చదువుకొనేవారు విద్యాధిదేవతగా విజ్ఞానశక్తిని ’సరస్వతి’ అని కొలుచుకు౦టారు. ఒకనాటి విద్యార్థుల ’దసరా పద్యాలు’ ఇప్పటి పెద్దతరాలకు తీయని బాల్యస్మృతులు. వాణిజ్య వ్యాపారోద్యోగాలతో ఆర్జి౦చేవారికి ద్రవ్యశక్తి లక్ష్మిగా గోచరిస్తు౦ది. ధర్మరక్షణకోస౦, అధర్మపు అసురత్వాన్ని మర్ది౦చే ’దివ్యశక్తి’లోక క్షేమానికై అనుగ్రహి౦చాలనే వారికి ఆ శక్తి ’దుర్గ’గా స్ఫురిస్తు౦ది. ఆశ్వయుజ౦ శక్తి పర్వాల మాసమైతే దీనికి ఒకవైపు భాద్రపద౦, మరొకవైపు కార్తీక౦ ఉన్నాయి. ఈరె౦డూ కూడా పర్వదిన ప్రాధాన్యమే. భాద్రపదమనగానే గణపతి గుర్తొస్తారు. కార్తీక౦ –కృత్తికా నక్షత్ర ప్రధాన౦. ఆ నక్షత్రపు దైవ౦ సుబ్రహ్మణ్యుడు. ఆశ్వయుజానికి అటూయిటూ ఇరుమాసాలూ గణేశ, సుబ్రహ్మణ్య రూపాలైతే మధ్యనున్న ఆశ్వయుజ౦ ఇద్దరు పిల్లల నడుమ కొలువైన జగద౦బా రూప౦గా భాసిస్తో౦ది.
ఈపర్వానికి ’దసరా’ అని వ్యవహార౦. నిజానికి ఈ పద౦ పేరు ’దశహరా’ క్రమ౦గా రూపా౦తర౦ చె౦ది ’దసరా’గా మారి౦ది. ఈపేరు వెనుక పలుభావాలున్నాయి. ఈ పదిరోజుల ప౦డుగ పదిరకాల పాపాలను హరిస్తు౦దని శాస్త్ర౦. దేహశుద్ధికై నిత్యస్నాన౦, అడపాదడపా అభ్య౦గ౦లాగానే చిత్తశుద్ధికై, దివ్యత్వసిద్ధికై నిత్య పూజలతోపాటు సర్వపూజలున్నాయి. మానవుడు త్రికరణాల్లో ప్రధాన౦గా పది పాపాలు చేస్తాడని ధార్మిక గ్ర౦ధాలు చెబుతున్నాయి.
శారీరక పాపాలు మూడు. ఇతరుల ద్రవ్యాలను వారి అనుమతిలేకు౦డానే స్వీకరి౦చడ౦ (చౌర్య౦), ఇతరులను హి౦సి౦చడ౦, పరస్త్రీ స౦గమ౦. మానసిక పాపాలు మూడు. పరద్రవ్యాలపై అభిలాష, పరులకు కీడు తల౦చడ౦, పనికిమాలిన అహ౦కార౦.
వాచిక పాపాలు నాలుగు. పరుష౦గా మాట్లాడడ౦, అసత్యాలు పలకడ౦, పరని౦ద. అస౦బద్ధ౦గా వాగడ౦. ఈ పదిపాపాల దోషాలను పోగొట్టుకు౦టేనే చిత్తశుద్ధి పశ్చాత్తాప౦ చె౦దినవారు ఈదోషాల ప్రభావ౦ ను౦చి బైటపడటానికి ’దశహరా’వ్రతాలు చెబుతారు. వాటిలో ఒకటి ఈ నవరాత్రులు. దశవిధ పాపాలను హరి౦చే వ్రత౦ ’దశహరా’ అని ఆచార స౦ప్రదాయ౦ చెబుతో౦ది.
మానవజీవిత౦ నాలుగుదశలు-బాల్య, కౌమార, యౌవన, వార్ధక్యాలు. ఈదశలే అన్ని జన్మల్లోనూ ఉ౦టాయని. ఈజన్మపర౦పర లేని స్థితి ’మోక్ష౦’ అని వ్యవహార౦. మోక్షమ౦టే ఏమిటో అవగాహన కలిగి, అమ్మవారిని ఆరాధి౦చేవారికి జన్మరాహిత్యమే అ౦టే-నాలుగుదశలూ లేని కైవల్యమే. ’దశ’లను హరి౦చి మోక్షమిచ్చే వ్రత౦ కనుక ’దశహరా’ అని శాస్తాలు చెప్పిన మరోనిర్వచన౦.
జాతక౦లో మహర్దశలు, దుర్దశలు ఉ౦టాయి. సర్వగ్రహాలను తన కనుసైగలతో నడిపే విశ్వనియామక ’శక్తి’ని ఆరాధి౦చి, గ్రహాల ప్రభావాల దు’ర్దశ’లను హరి౦పజేసే అనువైన ఉపాయ౦గా శాస్త్రాలు నవరాత్రి వ్రతాన్ని నిర్దేశి౦చాయి. కనుకనే ’దు’ర్దశ’హరా’ అని భావి౦చవచ్చు. ఈవిధ౦గా ఎన్నో దివ్యభావాల కలబోతగా జరుపుకొనే ఈపర్వాల ప్రభావ౦ చేత దేశ సౌభాగ్య౦ వర్ధిల్లుగాక అని జగద౦బను ప్రార్థిద్దా౦.

శరన్నవరాత్రులు, అమ్మవారి పూజా విధానం

ముందుగా పసుపు గణపతిని పూజించి నిర్విఘ్నంగా మీ నవరాత్రి పూజ జరగాలి అని కోరుకోవాలి . కలశాన్ని మీకు అలవాటు ఉంటే పెట్టండి లేకపోతే ఉద్దరిణిలో పువ్వు వేసి దానిపై చై పెట్టి కలశంగా భావించి మంత్రం చదివి ఆ నీటిని పూజ ద్రవ్యాల పైన చల్లి సంకల్పమ్ చెప్పుకుని ఆచనం చేసి ఏ రోజు ఏ దేవత రూపాన్ని పూజించాలి ఆ దేవతకు సంబంధించిన అష్టోత్తరం , స్త్రోత్రం తో ఆర్చన చేసి నివేదన చేసి హారతి ఇవ్వాలి… కలశం, సంకల్పమ్, ఆచమనం అన్ని వ్రత పుస్తకాలు లో లభిస్తుంది… గమనించండి.

శరదృతువులో వస్తుంది కాబట్టి ‘శరన్నవరాత్రులు’ అంటారు. ఈ ఋతువులో వర్షాకాలం ముగిసి చలికాలం మొదలవుతుంది. ఈ సమయంలో వాతావరణంలో కలిగే మార్పులు అనేక రోగాలకు కారణమవుతాయి. అందుకే ఈ అశ్వయుజ శుద్ధ పాడ్యమినుండి నవమి వరకు శక్తి ఆరాధన పేరుతో ప్రజలంతా శుచిగా, శుభ్రంగా ఉండి ఎలాంటి రోగాల దరిజేరవన్నది ఈ నవరాత్రి వేడుకల వెనుక ఉన్న చరిత్ర. మార్కండేయ మహర్షి అమ్మవారిని ఎలా ఆరాధించాలి అని అడగడంతో బ్రహ్మ ఇలా వివరించాడట.

నవదుర్గలు గా పూజించే వారు ఆ రూపంలో , ఆ రోజుల్లో వివిధ రూపాల్లో పూజించే వారికి ఆ రూపంలో వివరాలు ఉన్నాయి చూడఁడి. ప్రతి రోజూ లలితా సాహస్త్ర నామం పారాయణ చేయాలి..కుంకుమతో అర్చన చేయడం ఇంకా మంచిది.

ప్రధమంశైలపుత్రిణి, ద్వితీయం బ్రహ్మచారిణి
తృతీయం చంద్రఘంటేతి, కూష్మాంతేతి చతుర్ధామ్||
పంచమం స్కంధమాతేతి షష్ఠమం కాత్యాయనీ తిచ
సప్తమం కాళరాత్రంచ, మహాగౌరేతి చాష్టమం
నవమం సిద్ధితి ప్రోక్త, నవదుర్గ ప్రకీర్తిత||

1) శైలపుత్రి (బాలా త్రిపుర సుందరి)

దుర్గాశరన్నవరాత్రుల్లో పాడ్యమి నాడు ప్రారంభమయ్యే మొదటి అవతారం శైలపుత్రి. దక్షుని ప్రథమ పుత్రిక. శిరస్సున అలంకారంగా బాల చంద్రరేఖను ధరించి ప్రతిశూలాన్నీ చేత బట్టి ఎద్దు వాహనంపై కూర్చునే అవతారమే శైలపుత్రి. పరమేశ్వరుడే తనకు పతికావాలని కోరుతుంది. ఆమె కోరిక ప్రకారం హిమవంతునికి పుత్రికగా జన్మిం చింది. ఆమె వాహనం ఎద్దు. ఎద్దులా మొద్దు స్వరూపాలై పోకుండా మానవుల్లో చురుకుదనాన్ని కల్గించడానికి సంకేతం శైలపుత్రి.
ఈ రోజు అమ్మవారికి పొంగలి నైవేద్యం పెట్టి అర్చిస్తే అభీష్ట సిద్ధి కలుగుతుంది.

శ్లో|| వందే వాంఛిత లాభాయ చంద్రార్ధకృతశేఖరాం| వృషారూఢాం శూలధరాం శైలపుత్రీ యశస్వినీమ్ ||

బాలా త్రిపుర సుందరి దేవి గా గృహంలో పూజించే వారు తల్లి స్త్రోత్రం , అష్టోత్తరం తో అర్చన చేయాలి లలితా సహస్త్ర నామం చదివి నివేదించి హారతి ఇవ్వాలి.

2) బ్రహ్మచారిణి (గాయత్రి, రెండవ రూపం అయిన గాయత్రి గా పూజించే వారు శత గాయత్రీ జపించాలి, గాయత్రి ఉపదేశం లేని వారు అష్టోత్తరం , లలితా సహస్త్ర నామం తో పూజ పూర్తి చేయాలి)

దుర్గామాత రెండవ అవతారం బ్రహ్మచారిణి. పరమేశ్వరుని భర్తగా పొందడానికి నారదుడి ఉపదేశానుసారం ఘోరతపస్సు చేస్తుంది. ఆకులు కూడా తినకుండా ఉన్నందున అపర్ణగా ప్రసిద్ధి. పరమేశ్వరుని భర్తగా పొందే వరకు ఈమె బ్రహ్మచారిణి. ఆమెకే కన్యాకుమారి అనే మరోపేరుంది. ఈ మాతను ఉపాసించే వారికి సర్వత్రాసిద్ధి విజయాలు ప్రాప్తిస్తాయి.

శ్లో|| దధానా కరపద్మాభ్యాం అక్షమలాకమండలూ | దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా ||

పాయసం నివేదించాలి.

3) చంద్రఘంట ( అన్నపూర్ణ, అన్నపూర్ణగా ఆరాధించే వారు అష్టోత్రం, లలితా సహస్త్ర నామంతో అర్చించాలి )

అమ్మవారి మూడవ అవతారం చంద్రఘంట ఈ రూపం మిక్కిలి కళ్యాణ కారకం. శిరస్సుపై ధరించిన అర్థచంద్రుడు అర్ధాకృతలో ఉండటం వల్ల ఆమెకు చంద్రఘంట అని పేరు వచ్చింది. ఈ తల్లిని శరణుజొచ్చినవారికి ఎల్లప్పుడూ అభయఘంట మోగుతూ ఉంటుంది.

శ్లో|| పిండజప్రవరూరుఢా చంద్రకోపాస్త్ర కైర్యుతా| ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విశ్రుతా ||

పులిహోర, పెసరపప్పు పాయసం నివేదించాలి.

4) కూష్మాండ ( కామాక్షి స్త్రోత్రం)

అమ్మవారి నాలుగవ అవతారం కూష్మాండ అంటే బూడిద గుమ్మడికాయ ఈమె తేజోమయి. ఎనిమిది భుజాలతో విరాజిల్లుతుండటం వల్ల ఈమెను ‘అష్టభుజదేవి’ అని కూడా అంటారు.

శ్లో|| సురా సంపూర్ణకలశం రుధిరాప్లుతమేవ చ| దధానా హస్త పద్మభ్యాం కూష్మాండా శుభ దాస్తుమే ||

కూరగాయలు వేసి చేసిన కాదంబం నైవేద్యం పెట్టాలి.

5) స్కందమాత ( లలిత అష్టోత్తర, సహస్త్ర నామంతో)

అయిదో అవతారం స్కందమాత స్కంధుడు అనగా కుమార స్వామి. స్కందుని తల్లి అయినందున ఈమెను స్కందమాత అని పిలుస్తారు. ఈ తల్లి వాహనం కమలాసనంపై పద్మాసనంగా శ్వేతపద్మంతో శోభిల్లుతుంది. తనను నమ్మిన భక్తులకు పతనం లేకుండా ఆ అమ్మ ఉద్ధరిస్తుందునటానికి సంకేతమే ఇది.

శ్లో|| సంహాసనగతా నిత్యం పద్మాశ్రిత కరద్వయా| శుభదాస్తు సదాదేవీ స్కందమాతా యశస్వినీ ||

గోధుమ రవ్వతో చేసిన కేసరి, మిర్యాల పొంగలి నివేదించాలి.

6) కాత్యాయని (లక్ష్మి అష్టోత్తరం, సహస్త్ర నామం)

దుర్గామాత ఆరో అవతారం కాత్యాయని. ‘కొత్స’ అనే రుషి తనకు పార్వతీమాత కుమర్తెగా జన్మించాలని తపస్సు చేశాడు. అతనికి కూతురుగా జన్మించింది. కనుకనే కాత్యాయని అనే పేరు వచ్చింది. మహిషాసురుణ్ని వధించడానికి బ్రహ్మవిష్ణు మహేశ్వరులు తమ తేజస్సుల అశంతో ఒక దేవిని సృష్టిస్తారు. మొట్టమొదట ఈ కాత్యాయనిని మహర్షి పూజిస్తారు. ఈమె ఆశ్వయుజ శుక్లసప్తమి, అష్టమి, నవమి తిథుల్లో పూజలందుకుని విజయదశమినాడు మహిషాసురుణ్ని వధిస్తుంది.

శ్లో||చంద్రహాసోజ్జ్వలకరా శార్దూల వరవాహనా | కాత్యాయనీ శుభం దద్యాద్దేవీ దానవఘాతినీ ||

బెల్లం అన్నం, అన్నం ముద్దు పప్పు, నైవేద్యం

7) కాళరాత్రి ( సరస్వతి స్త్రోత్రం ,లలితా సహస్త్ర నామం )

దుర్గామాత ఏడో అవతారం కాళరాత్రి. ఈమె శరీరం ఛాయ చీకటివలె నల్లగా ఉంటుంది. ఇందుకే ఈదేవికి కాళరాత్రి అని పేరు. ఈమె వాహనం గాడిద. ఈ తల్లి ఎప్పుడూ శుభ ఫలితాలను ఇస్తుంది. అందువలన ఈమెను శుభంకరి అని కూడా పిలుస్తారు.

శ్లో|| ఏకవేణీ జపాకర్ణపూరా నగ్నాఖరాస్థితా| లంబోష్ఠీ కర్ణికాకర్ణీ తైలాభ్యక్త శరీరిణీ |
వామపాదోల్లసల్లోహలతాకంటక భూషణా| వర మూర్ధధ్వజా కృష్ణా కాళరాత్రిర్భయంకరీ ||

దద్దోజనం, చక్కెర పొంగలి నైవేద్యం.

8) మహాగౌరి ( దుర్గ అష్టోత్రం,విజయ దుర్గా స్త్రోత్రం, లలితా సహస్త్ర నామం)

అమ్మవారి ఎనిమిదవ అవతారం మహాగౌరి. ఈమె పరమేశ్వరుడిని భర్తగా పొందటానికి కఠోర తపస్సు చేస్తుంది. దీని కారణంగా ఈమె దేహం నల్లబడుతుంది. ఆమె తపస్సుకుమెచ్చి ఆమె శరీరాన్ని గంగాజలంతో ప్రక్షాళనం చేస్తారు. దాని వలన ఆమె శరీరం గౌరవర్ణతో విద్యుత్తు కాంతులను వెదజల్లుతూ ఉంటుంది. అప్పటి నుంచి ఆమె మహాగౌరిగా ప్రసిద్ధి కెక్కింది.

శ్లో|| శ్వేతే వృషే సమారూడా స్వేతాంబరధరా శుచిః| మహాగౌరీ శుభం దద్యాత్, మహాదేవ ప్రమోదదా ||

గారెలు, పులిహోర నైవేద్యం.

9) సిద్ధిధాత్రి (మహిషాసుర మర్దిని స్త్రోత్రం, లలితా సహస్త్ర నామం) (రాజ రాజేశ్వరి స్త్రోత్రం)

దుర్గామాత తొమ్మిదవ శక్తి రూపం సిద్ధిధాత్రి. ఈమె అన్ని సిద్ధులనూ ప్రసాది స్తుంది. పరమేశ్వరుడు సర్వ సిద్ధులను ఈదేవీ కృపతో పొందాడని దేవీ పురాణాలు చెబుతున్నాయి.

శ్లో|| సిద్ధగంధర్వయక్షాద్యైరసురైరమరైరపి| సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయినీ ||

కొబ్బరి అన్నం, నిమ్మకాయ పులిహోర.

10) విజయ దశమి రోజు: శమీవృక్ష ప్రార్థన:

శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశనీ,
అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియవాదినీ.
శమీ శమయతే పాపం శమీలోహిత కంటకా,
ధారిణ్యర్జున బాణానాం రామస్య ప్రియవాదినీ.
కరిష్యమాణ యాత్రాయాం యథాకాలం సుఖంమయా,
తత్ర నిర్విఘ్న కర్త్రీత్వం భవ శ్రీరామపూజితే.”

పైన చెప్పిన మంత్రార్థం ఏమిటో చూద్దాం.

“శమీ వృక్షము అనేది పాపాన్ని శమింపచేసేది. శత్రువులను నాశనం చేస్తుందిది. ఇది నాడు అర్జునుని ధనువును కల్గి ఉండింది. శ్రీరాముడికి ప్రియాన్ని కల్గించింది.

యాత్రార్థులకు సౌఖ్యాన్నిస్తుంది. పనులన్నిటినీ నిర్విఘ్నంగా కొనసాగేలా చేస్తుంది.”

ప్రతి స్త్రీ అమ్మవారి రూపమే

నవరాత్రి సమయంలో నే కాదు ఎప్పుడు ఎవరికి తాంబూలం ఇచ్చిన ఆ ఆడవాళ్లకు అమ్మవారి స్వరూపంగా భావించే ఇవ్వాలి.. భావించడం ఎందుకు అమ్మవారే అనుకోవాలి.. ప్రతి స్త్రీ లోనూ ఆ తల్లి అంశ ఉంటుంది.. చిన్న పిల్లలు బాల స్వరూపం.. ముత్తైదువులు త్రి మాత స్వరూపం, బిడ్డలు కనని తల్లి పార్వతి స్వరూపం ఆమె గర్భం దాల్చలేదు అందువల్ల పిల్లలు లేని వారు బాధ పడకూడదు అందరూ తమ పిల్లలే అనుకోవాలి, భర్త లేని పూర్వ సువాసినిలు ధూమ్రవతి స్వరూపం.. వారు కూడా లలితా నామ పారాయణం అమ్మవారికి పూజ చేయవచ్చు.. ఆడవాళ్లు భక్తిగా పూజ చేస్తే చాలు కొన్ని సంవత్సరాలు తపస్సు చేసిన ఫలితం వారికి అమ్మవారు అనుగ్రహిస్తుంది.. ఆడవాళ్లు ఎక్కువగా మౌన వ్రతం పాటిస్తే త్వరగా అనుగ్రహిస్తుంది. పూర్వ సువాసినిలు తాంబూలం ఇవ్వకూడదు తీసుకోకూడదు కానీ నిక్షేపంగా పూజ చేసుకోవచ్చు…ప్రసాదం తీసుకోవచ్చు ఇవ్వచ్చు. మీ యొక్క స్థితి గతులను లోటు పాట్లు అన్ని ఆమెకు తెలిసినదే కదా ఎవరో చేసినట్టు చేయాలి అని అప్పుచేసి ఆడంబరంగా చేయకండి.. ఉన్నంతలోనే తృప్తిగా పూజ నామ జపం చేసుకోండి.. తాంబూలం తో పాటు కుదిరితే రవిక ముక్క స్తోమత ఉంటే చీర పెట్టండి లేకుంటే తాంబూలం పసుపుకుంకుమా ప్రసాదం పంచుకున్నా చాలు..గాజులు పంచుకోండి ,మగవాళ్ళు నవరాత్రి వ్రతం చేసే వాళ్ళు వారి ఇంట్లో అడవాళ్ళతో తాంబూలం ఇప్పించండి..మగవాళ్ళు పరాయి ఆడవాళ్ల చేతికి పసుపుకుంకుమ ఇవ్వకూడదు , కానీ భార్యకు వాళ్ళ చేత్తో తాంబూలం పసుపుకుంకుమా గాజులు ఇస్తే మంచిది అలాగే ఇంట్లో అమ్మవారి కి తాంబూలం సమర్పిస్తాము కదా (ఆకు వక్క, పసుపుకుంకుమా, రవిక గాజులు, చీర) ఇలాంటివి తల్లికి సమర్పించినవి భర్త చేత్తో మీరు స్వీకరించాలి అక్షంతలు వేయించు కుని ఆశీర్వాదం తీసుకోవాలి అది వారికి మంచిది తీసుకున్న భార్యకు మంచిది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *